News February 24, 2025
ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్ల నియామకాలు

TG: ఆర్టీసీలో డ్రైవర్ల కొరతను తగ్గించేందుకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకానికి సంస్థ సిద్ధమైంది. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజిలో నమోదైన వారిని నియమించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 1,500 మంది నియామకానికి సర్క్యులర్ జారీ చేసింది. 4 నెలల కాలానికే వీరిని నియమించనున్నట్లు పేర్కొంది. గత ఏడాది 3వేల డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు చేసినా నియామక ప్రక్రియ ఆలస్యమవుతోంది.
Similar News
News February 24, 2025
ఉప ఎన్నికలు ఎలా వస్తాయి?: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో గత పదేళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘గతంలో TDP, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను BRSలో చేర్చుకోలేదా? వారిని మంత్రులను చేయలేదా? అప్పుడు రాని ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి. అప్పటి కోర్టులే కదా ఇప్పుడు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు తరచుగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే.
News February 24, 2025
CRICKET: ఈ రోజు చాలా స్పెషల్ గురూ..

క్రికెట్ చరిత్రలో వేర్వేరు సంవత్సరాల్లో ఈ రోజు(FEB 24)న పలు రికార్డులు నమోదయ్యాయి. 2010లో సౌతాఫ్రికాపై వన్డేల్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశారు. అంతర్జాతీయ వన్డేల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. 2013లో మిస్టర్ కూల్ ధోనీ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచారు. ఇక 2015లో విండీస్ క్రికెటర్ గేల్ వన్డే వరల్డ్ కప్‌లో ద్విశతకం బాదిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కారు.
News February 24, 2025
KCR, హరీశ్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

TG: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో BRS అధినేత KCR, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై భూపాలపల్లి క్రిమినల్ కోర్టు కేసీఆర్, హరీశ్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.