News July 24, 2024
ITBPలో హెడ్ కానిస్టేబుల్ కొలువుల భర్తీ

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP)లో 112 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 5 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. డిగ్రీ పాసై ఉండాలి. పురుషులు 170 సెం.మీ ఎత్తు, 80-85 సెం.మీ ఛాతీ కలిగి ఉండాలి. మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. వెనుకబడిన వర్గాలకు సడలింపులున్నాయి. ఫిజికల్ టెస్టుల్లోనూ పాసవ్వాల్సి ఉంటుంది. సైట్: itbpolice.nic.in/ చివరి తేదీ:AUG 5
Similar News
News December 1, 2025
విశాఖ జిల్లాలోని స్కూళ్లలో పిల్లలకు ఉదయం స్నాక్స్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో మూడు రోజుల మార్నింగ్ న్యూట్రిషన్ అందించేందుకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అక్షయపాత్ర సహకారంతో కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. తొలి విడతగా 178 పాఠశాలల్లో ప్రారంభించి, త్వరలో అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. ఉదయం అల్పాహారం లేక తరగతులకు వచ్చే పిల్లలకు చిరుతిండ్లు వంటివి అందించనున్నారు.
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.
News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


