News July 25, 2024
పోలీస్ శాఖలో సిబ్బంది నియామకాలు అప్పుడే: హోంమంత్రి

AP: రాష్ట్ర పోలీస్ శాఖలో 20వేల సిబ్బంది కొరత ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ‘కోర్టుల్లో కేసుల కారణంగా కానిస్టేబుళ్ల నియామకం నిలిచిపోయింది. వివాదం పరిష్కారం కాగానే నియామకాలు చేపడతాం’ అని శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చెప్పారు. 2024 నాటికి రాష్ట్రంలో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు 46,538 నమోదయ్యాయని, ట్రేసవుట్ కాని కేసుల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Similar News
News November 14, 2025
కమలం జోరు.. కాంగ్రెస్ బేజారు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో BJP దూసుకెళ్తోంది. JDUతో కలిసి బరిలోకి దిగిన కాషాయ పార్టీ 95 సీట్లలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2020 ఎన్నికల్లో ఆ పార్టీ 74 స్థానాలు గెలవగా ఇప్పుడు ఆ సంఖ్యను భారీగా పెంచుకుంటోంది. అటు ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ బోల్తా పడింది. కేవలం 3 చోట్లే ఆధిక్యంలో ఉంది. గత ఎలక్షన్స్‌లో హస్తం పార్టీ 19 సీట్లు గెలవగా ఇప్పుడు మరింత దిగజారింది.
News November 14, 2025
చనిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ అన్వర్ నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తయిన కౌంటింగ్‌లో ఆయనకు 24 ఓట్లు వచ్చాయి. 924 ఓట్లతో NOTA 4వ స్థానంలో నిలిచింది. అటు ఇండిపెండెంట్ అభ్యర్థి రాథోడ్ రవీందర్ నాయక్‌కు అత్యల్పంగా 9 ఓట్లు పడ్డాయి. కాగా ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు.
News November 14, 2025
చిరాగ్ పాస్వాన్: పడి లేచిన కెరటం!

సరిగ్గా ఐదేళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు LJP అధినేత చిరాగ్ పాస్వాన్. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130కి పైగా సీట్లలో పోటీ చేసి కేవలం ఒకేఒక స్థానంలో గెలిచారు. బాబాయ్‌తో వివాదాలు, 2021లో పార్టీలో చీలిక తర్వాత తట్టుకుని నిలబడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో NDAతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 5 చోట్లా గెలిచి పట్టు నిలుపుకున్నారు. తాజాగా 29 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల లీడింగ్‌లో ఉన్నారు.


