News August 7, 2024

ఆ పోస్టుల భర్తీ పారదర్శకంగా నిర్వహించాలి: లోకేశ్

image

AP: కేజీబీవీ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీ పారదర్శకంగా నిర్వహించాలని విద్య ఉన్నతాధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. 100% అకడమిక్ ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయాలన్నారు. అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలని ఆయన సూచించారు. కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్‌లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు.

Similar News

News April 2, 2026

నా భూమి లాక్కున్నారు.. నటి సోనాలిపై రైతు కేసు!

image

సీనియర్ నటి సోనాలీ బింద్రే, ఆమె భర్త గోల్డి బెహల్ తన 30 గుంటల భూమిని ఆక్రమించారంటూ పుణేకు చెందిన రైతు చంద్రకాంత్ పోలీసులను ఆశ్రయించారు. ఆ భూమి 1957 నుంచే వంశపారంపర్యంగా వస్తోందని, తనను బెదిరించి ఆక్రమించారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే తాను చట్టబద్ధంగానే ఆ భూమిని కొనుగోలు చేశానని సోనాలి చెబుతున్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని, కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు.

News April 2, 2026

గుండెల మీద ఆడించిన తండ్రే.. కర్కశంగా చంపేశాడు!

image

AP: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఉంటానని కూతురు చెప్పడాన్ని తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆమె గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేసి, ఆపై ఉరేసి చంపాడు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి(22), అదే మండలానికి చెందిన నాగరాజు గత నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకే మాట్లాడుకుందామని పెద్దలు వారిని మాచర్ల తీసుకురాగా 18న హత్య జరిగింది. పోలీసులు నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News April 2, 2026

రాముడి లుక్‌కు ఫిదా.. VFXపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు!

image

నితేశ్ తివారీ ‘రామాయణ’ <<19543549>>టీజర్‌పై<<>> SMలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ‘ఆదిపురుష్’ కంటే బెటర్ అని కొందరు.. అంతా ఏఐ వీడియోలా ఉందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో VFX క్వాలిటీ, గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.