News October 16, 2024
RED ALERT.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈనెల 17వ తేదీ పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నెల్లూరు జిల్లాకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Similar News
News October 14, 2025
అనధికార MIHM ఫంక్షన్ హాల్ సీజ్

హై కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని కోటమిట్టలో ఉన్న అన్నధికారికంగా చేపట్టిన MIHM ఫంక్షన్ హాల్‌ను కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. దీని తరువాత కార్యాచరణ నిమిత్తం దీన్ని ఫంక్షన్ హాల్ యాజమాన్యం సమక్షంలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఎలక్ట్రికల్ సిబ్బంది సీజ్ చేయడం చేశారు.
News October 14, 2025
“బర్త్ రేట్ “లో నెల్లూరు ఎక్కడంటే?

రాష్ట్ర వ్యాప్తంగా birth rate ను పరిశీలిస్తే జిల్లాలో 1000 మంది బాలురుకు 1011 మంది బాలికలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. లింగ వివక్షకు సంబంధించి చట్టాలు కఠినంగా ఉండడంతో కొంతమేరా వీటికి అడ్డుకట్ట పడినట్లు తెలుస్తోంది. అయితే ఏదొక మూల వైద్య శాఖ కళ్లు గప్పి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయానేది సమాచారం.
News October 14, 2025
జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా సుజాత బాధ్యతలు

నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారినిగా సుజాత బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ సంబంధిత శాఖ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న పరిమళ బదిలీ కావడంతో కొద్ది కాలంగా ఈ పోస్ట్ భర్తీ కాలేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్న సుజాతకు ప్రమోషన్ లభించడంతో అధికారులు ఆమెను నెల్లూరుకు బదిలీ చేశారు.