News September 26, 2025
Red Alert: విజయనగరంలో భారీ వర్షం

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్లు, శిథిల భవనాలు, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని సూచించింది.
Similar News
News September 27, 2025
పైడితల్లమ్మ పండగ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు: SP

పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవం ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అమ్మవారి దర్శనం, సినిమానోత్సవంలో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చర్యలు చేపట్టాలన్నారు. సినిమాను తిరిగే మార్గంలో ప్రెజర్ పాయింట్స్ వద్ద మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
News September 26, 2025
సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు: కిమిడి

సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. శుక్రవారం ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ జిల్లా మహాజన సభ డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గోంప కృష్ణ మాట్లాడుతూ..డీసీఎంఎస్ను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
News September 26, 2025
VZM: 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే అధికంగా ఓటర్లు

పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయనరగరం కలెక్టరేట్లో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 126 పోలింగ్ కేంద్రాల్లో 1,200 కంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నారని తెలిపారు. 1200 కంటే ఎక్కువ ఉన్నచోట అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు.