News August 2, 2024

హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్

image

హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కులు, మండీ, సిమ్లా, చంబా, కంగ్రా, సిర్మౌర్ జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని అంచనా వేసింది. ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ఆకస్మిక వరదల వల్ల ఇప్పటివరకు హిమాచల్‌లో ఐదుగురు మరణించారు. 50 మందికి పైగా గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడ్డాయి. బ్రిడ్జిలు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Similar News

News November 17, 2025

బిహార్ ‘మహాగురు’.. MLAగా గెలవలేకపోయారు!

image

బిహార్ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుడు, టాప్ మ్యాథమెటీషియన్ కృష్ణ చంద్ర సిన్హా ఓడిపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన JSP నుంచి పోటీ చేసిన ఈయనకు కేవలం 15వేల ఓట్లే వచ్చాయి. ఈయన బీఎస్సీ, ఎంఎస్సీలో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించారు. PhD పూర్తి చేశారు. గణితంపై 70 పుస్తకాలు రాశారు. బిహార్‌లో ఈయనను మహాగురు అని పిలుస్తారు. అయినా రాజకీయాల్లో రాణించలేకపోయారు.

News November 17, 2025

ఇవాళ ఈ మంత్రం జపిస్తే ‘అకాల మృత్యు భయం’ తొలగుతుంది!

image

కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత ముఖ్యమైనవి. చివరి వారమైన ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శివానుగ్రహం లభించి, అకాల మృత్యు భయం తొలగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిష్ఠతో జపిస్తే శివుడు ఎల్లప్పుడూ కాపాడుతారని ప్రతీతి.
*‘ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్’*

News November 17, 2025

రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500% టారిఫ్!

image

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాల కట్టడికి అమెరికా సెనేట్ కొత్త బిల్లు తెచ్చింది. అలాంటి దేశాలపై 500% టారిఫ్ విధించేలా తెచ్చే బిల్లును సెనేటర్ లిండ్సే ప్రతిపాదించారు. దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతిచ్చారు. దీంతో భారత్, చైనా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించినట్లు సమాచారం.