News August 19, 2025
RED ALERT: ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అటు ఏపీలోని అల్లూరి, ఏలూరు, NTR జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
Similar News
News August 19, 2025
ఏపీ ముచ్చట్లు

* ఇవాళ శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల బ్రహ్మోత్సవాలు. తొలి రోజున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పణ. సెప్టెంబర్ 28న గరుడసేవ.
* సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న అంగన్వాడీల నిరసన
* రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు(SBTET)కు NCVET గుర్తింపు. ఇకపై సాంకేతిక విద్య పరిధిలోని కోర్సులు చేసిన విద్యార్థులకు డ్యుయల్ సర్టిఫికెట్.
News August 19, 2025
ఈ నెల 22న తెలంగాణ బంద్

TG: మార్వాడీల దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్ నుంచి వారు ఇక్కడికి వలస వచ్చి కులవృత్తులను దెబ్బతీస్తున్నారని మండిపడింది. రాష్ట్ర ప్రజలను మార్వాడీలు దోచుకుంటున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా మార్వాడీ గో బ్యాక్ అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు.
News August 19, 2025
సైనికుల చేతికి హైదరాబాద్ మెషీన్ గన్స్

TG: హైదరాబాద్‌కు చెందిన మరో తుపాకీ ఆర్మీ చేతికి అందనుంది. బాలానగర్‌లోని లోకేశ్ మెషీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ‘అష్మీ’ పేరుతో సబ్ మెషీన్ గన్ తయారు చేసింది. దీంతో ఆర్మీ రూ.17.7 కోట్ల విలువైన ఆర్డర్‌ను ఈ సంస్థకు ఇచ్చింది. ఇది 1,800 మీటర్ల రేంజ్‌ను ఛేదించగలదు. MMG కంటే 25 శాతం బరువు తక్కువగా ఉంటుంది. 250 తూటాల బెల్ట్ కెపాసిటీ దీని సొంతం. మైనస్ 40 నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఇది చక్కగా పనిచేస్తుంది.