News July 20, 2024
RED ALERT.. అత్యంత భారీ వర్షాలు

TG: ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం RED అలర్ట్ జారీ చేసింది. NZB, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ములుగు, కొత్తగూడెం, KMM, WGL, హన్మకొండ, VKB, SRD, కామారెడ్డి, MBNR, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News November 23, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో (కలెక్టరేట్) ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు ఘనంగా నివాళులర్పించారు.
News November 23, 2025
ముత్తుసామి సూపర్ సెంచరీ

రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ప్లేయర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ముత్తుసామి(101*) క్రీజులో పాతుకుపోయి సెంచరీతో అదుర్స్ అనిపించారు. ఇది అతడికి తొలి టెస్ట్ సెంచరీ. మార్కో జాన్సన్(49*) సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. INDకు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇండియన్ బౌలర్లు విజృంభించి వికెట్లు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం RSA స్కోర్ 418/7గా ఉంది.
News November 23, 2025
672 Sr రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఎయిమ్స్ న్యూఢిల్లీ 672 Sr రెసిడెంట్/Sr డెమాన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 4వరకు అప్లై చేసుకోవచ్చు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి MBBS, DNB/MD/MS/PhD/MSc ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రాత పరీక్ష DEC 13న నిర్వహిస్తారు. వెబ్సైట్: www.aiimsexams.ac.in/


