News September 1, 2024

RED ALERT.. అత్యంత భారీ వర్షాలు

image

TG: ADB, నిర్మల్, NZB, కామారెడ్డి, MBNR, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ASF, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, VKB, సంగారెడ్డిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగతా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News November 4, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,12,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3000 తగ్గి రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 4, 2025

కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..

image

TG: కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంలేని కుటుంబసభ్యులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఝరాసంగం మం. కక్కర్‌వాడలోని విఠల్ కూతురు, అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో విఠల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి రాధాకృష్ణ తండ్రిపై ఘోరంగా దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు.

News November 4, 2025

వంటింటి చిట్కాలు

image

*మరమరాలు మెత్తబడినప్పుడు రెండు నిమిషాలు వేయిస్తే మళ్లీ కరకరలాడతాయి.
* చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి.
* ఉసిరికాయ నిల్వ పచ్చడి నలుపెక్కకుండా ఉండాలంటే జాడీలో పెట్టిన తర్వాత మధ్యలో ఇంగువ ముక్క ఉంచండి.
* బెండకాయలు 2, 3 రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలతో పాటు రెండో చివరను కూడా కోసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.