News October 28, 2025
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

TG: మొంథా తుఫాను ఎఫెక్ట్ రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే ఛాన్సుందని తెలిపింది.
Similar News
News October 28, 2025
రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరు: కవిత

TG: మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, ఆయనను ప్రజలు క్షమించరని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ‘జనంబాట’లో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరివెన రిజర్వాయర్‌ను ఆమె పరిశీలించారు. కేసీఆర్ హయాంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80% పూర్తయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఫైరయ్యారు.
News October 28, 2025
2 రాష్ట్రాల్లో ఓట్లు… పీకేకు EC నోటీసులు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్‌కు EC నోటీసులు జారీ చేసింది. ఆయనకు 2 రాష్ట్రాల్లో ఓటు ఉండడమే దీనికి కారణం. పీకే WBలో ఓటరుగా ఉన్నారు. తర్వాత కర్గహార్ (బిహార్) నియోజకవర్గ ఓటరుగా నమోదు అయ్యారు. రెండు చోట్ల ఓట్లుండటాన్ని గుర్తించిన EC వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చింది. అయితే బిహార్‌లో ఓటరుగా నమోదయ్యాక WB ఓటును తొలగించాలని PK అప్లై చేశారని ఆయన టీమ్ సభ్యులు తెలిపారు.
News October 28, 2025
తుఫాను ప్రభావం.. భీకర గాలులు

AP: మొంథా తుఫాను దృష్ట్యా పలు జిల్లాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కోనసీమ, విశాఖ, కాకినాడ జిల్లాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తీరం దాటే సమయంలో గంటకు 90-110 KM వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం *మచిలీపట్నం- 93 km/h *కాకినాడ- 82 km/h *విశాఖ- 68 km/h *రాజమండ్రి ఎయిర్‌పోర్ట్- 65 km/h *గంగవరం పోర్ట్- 58 km/h *చింతపల్లి- 55 km/h *బద్వేల్ (కడప)- 52 km/h వేగంతో గాలులు వీస్తున్నాయి.


