News March 26, 2025

RED ALERT: రేపు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మరింత ముదురుతున్నాయి. రేపు 47 మండలాల్లో <>తీవ్ర వడగాలులు,<<>> 199 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరిస్తూ APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 186 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ సిద్ధవటంలో 40.8°C, కమ్మరచేడులో 40.7°C, నిండ్రలో 40.1°C, మంగనెల్లూరులో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది.

Similar News

News November 25, 2025

పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

image

రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

News November 25, 2025

జుబీన్ గార్గ్‌ను హత్య చేశారు: సీఎం హిమంత

image

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం CM హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని, హత్యకు గురయ్యారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. 52 ఏళ్ల జుబీన్ ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మరణించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై తొలి నుంచీ ఆయన కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. ఈక్రమంలోనే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News November 25, 2025

బలవంతపు వాంతులతో క్యాన్సర్‌: వైద్యులు

image

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.