News November 28, 2024

రెడ్ అలర్ట్.. అతి భారీ వర్షాలు

image

ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీవ్ర వాయుగుండం ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారనుందని పేర్కొంది.

Similar News

News November 22, 2025

చార్మినార్ సాక్షిగా పోలీసుల సంకల్పం!

image

జాగృత్ హైదరాబాద్–సురక్షిత హైదరాబాద్ అనే నినాదంతో సైబర్‌క్రైమ్ మీద సిటీ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. నగర సంస్కృతి, వారసత్వానికి ప్రతీక అయిన చారిత్రక వద్ద ఈ కార్యక్రమం చేపట్టడం ఖుషీగా ఉందని CP సజ్జనార్ ట్వీట్ చేశారు. మన చారిత్రక నగరాన్ని డిజిటల్‌ సేఫ్, ఫ్యూచర్‌లోనూ సేఫ్‌గా ఉంచడానికి అందరం కలిసి పనిచేద్దాం’ అని సజ్జనార్ పిలుపునిచ్చారు.

News November 22, 2025

రేపు భారత్ బంద్‌కు పిలుపు

image

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బంద్‌కు అంతా సహకరించాలని కోరారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, నేతలు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పలు ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

News November 22, 2025

పైరసీతో చిన్న నిర్మాతలకు తీవ్ర నష్టం: బన్నీ వాస్

image

పైరసీ వల్ల ఎంతో మంది చిన్న సినిమాల నిర్మాతలు నష్టపోతున్నారని బన్నీ వాస్ అన్నారు. పైరసీ తప్పని, అలాంటి తప్పును కొందరు తమకు లాభం కలిగిందని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఏడాదిలో 10-15 సినిమాలకే టికెట్ రేట్స్ పెంచుతున్నారని పేర్కొన్నారు. కానీ ఆ సినిమాలకే కాకుండా మిగతా చిత్రాలూ పైరసీకి గురవుతున్నాయని తెలిపారు. పైకి బాగానే కనిపిస్తున్నా ఆ నిర్మాతలు లోపల బాధ పడుతున్నారన్నారు.