News August 9, 2024
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: అంబటి

AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ‘విజయవాడలోని అంబేడ్కర్ స్మృతివనంపై దాడి చేయడం దారుణం. చంద్రబాబు, లోకేశ్ ప్రమేయంతోనే ఈ దాడి జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దీనిని కూలగొట్టాలని ప్రయత్నించారు. ఇప్పుడు ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News December 13, 2025
నక్సలిజం పాము లాంటిది: అమిత్ షా

నక్సలిజం ఎవరికీ ప్రయోజనం కలిగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శాంతి మాత్రమే అభివృద్ధికి మార్గం చూపగలదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ‘నక్సలిజం విషపూరితమైన పాము లాంటిది. దాన్ని అంతం చేసిన తర్వాత అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది’ అని బస్తర్ ఒలింపిక్-2025 ముగింపు కార్యక్రమంలో పేర్కొన్నారు.
News December 13, 2025
AP గోదావరి నీటి మళ్లింపును అనుమతించొద్దు: ఉత్తమ్

TG: గోదావరి నీటి మళ్లింపునకు AP పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ పేరిట చేపట్టే ప్రాజెక్టును అధికారులు ఇవాల్యుయేషన్ చేయకుండా నిలువరించాలని కేంద్రం, CWCలను TG కోరింది. అలాగే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలనూ అడ్డుకోవాలంది. వీటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్, TGకి కృష్ణా నీటి కేటాయింపు తదితరాలపై సహకారాన్ని అభ్యర్థించారు.
News December 13, 2025
రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్, అఖిలేశ్

TG: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. కేఫ్‌లో వారిద్దరూ టిఫిన్ చేశారు. ఈ ఫొటోలను కేటీఆర్ తన X ఖాతాలో షేర్ చేశారు. కాగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్.. తొలుత సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.


