News April 5, 2024
రెడ్ బుక్ అంటే వైసీపీకి వణుకు: లోకేశ్

AP: రెడ్ బుక్ పేరెత్తితే వైసీపీలోని ప్రతి ఒక్కరికీ వణుకు పుడుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ‘టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి తీరుతాం. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీని ఎవరూ విశ్వసించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇవాళ విజయవాడలో లోకేశ్ సమక్షంలో అనంతపురం, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరారు.
Similar News
News December 22, 2025
మే 12 నుంచి EAPCET

AP: వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ (CETs)-2026 షెడ్యూల్‌ను APSCHE విడుదల చేసింది. ఆయా సెట్ల పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.
*EAPCET (Eng): 12, 13, 14, 15, 18
*EAPCET (agri, pharm): మే 19, 20
*ECET: ఏప్రిల్ 23
*ICET: ఏప్రిల్ 28
* LAW, EDCETs: మే 4
*PGECET: ఏప్రిల్ 29, 30, మే 2
*PGCET: మే 5, 8, 9, 10, 11
News December 22, 2025
GOOGLE MAP సాయంతో లూటీ… చివరకు ఏం జరిగిందంటే?

టెక్నాలజీ వాడుక ఇప్పుడు ఇళ్లలో లూటీలకూ పాకింది. గూగుల్ MAP స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో ధనవంతుల ఇళ్లున్న ప్రాంతాలు, వాటిలోకి ఎలా చొరబడవచ్చో గుర్తించి ఓ ముఠా జంషెడ్‌పూర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేసింది. అయితే పోలీసులు CCTV ఫుటేజీ, మొబైల్ ట్రాకింగ్‌ను కంబైనింగ్ చేసి పట్నాలో ఉన్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా పక్కరాష్ట్రాలకు పారిపోయేలా రూట్‌నూ ఎంచుకొని మరీ తమ నుంచి తప్పించుకొనేదని పోలీసులు తెలిపారు.
News December 22, 2025
అమీర్‌పేట్ గురించి ఈ విషయం మీకు తెలుసా?

HYD అమీర్‌పేట్ అంటే కోచింగ్ సెంటర్ల అడ్డా మాత్రమే కాదు.. లక్షలాది నిరుద్యోగుల ఆశల వారధి. 1900 కాలంలో ఆరో నిజాం తన జాగీర్దార్ అమీర్ అలీకి ఈ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చారు. అప్పటి వేసవి రాజభవనమే నేటి నేచర్ క్యూర్ ఆసుపత్రి. రాజసం నిండిన ఈ గడ్డపై ఎందరో విద్యార్థులు నైపుణ్యం పెంచుకుని ప్రపంచస్థాయి కంపెనీలలో స్థిరపడ్డారు. ప్రతి విద్యార్థికి అమీర్‌పేట్ ఓ భావోద్వేగం. ఎంత ఎదిగినా ఈ చోటును ఎవరూ మర్చిపోలేరు.


