News October 12, 2025

అధిక పోషకాల పంట ‘ఎర్ర బెండ’

image

సాధారణంగా దేశీయ బెండ(లావుగా, పొట్టిగా), హైబ్రిడ్ బెండ రకాలు ఆకుపచ్చగా (లేదా) లేత ఆకుపచ్చగా ఉండటం గమనిస్తాం. కానీ ఎర్ర బెండకాయలను కూడా సాగు చేస్తారని తెలుసా. ‘ఆంతో సయనిన్’ అనే వర్ణ పదార్థం వల్ల ఈ బెండ కాయలు, కాండం, ఆకు తొడిమెలు, ఆకు ఈనెలు ఎర్రగా ఉంటాయి. ఆకుపచ్చ బెండ కంటే వీటిలో పోషకాల మోతాదు ఎక్కువ. ఎర్ర బెండలో ‘కాశి లాలిమ’, ‘పూసా రెడ్ బెండి-1’ రకాలు అధిక దిగుబడినిస్తాయి.

Similar News

News October 12, 2025

తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా?

image

భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఆ పద్ధతి ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే స్నానం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదని, జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు. భోజనం చేశాక గంట నుంచి గంటన్నర తర్వాత స్నానం చేయాలని సూచించారు. అవి కూడా గోరువెచ్చని నీళ్లు అయితే బెటర్ అని చెబుతున్నారు.
Share it

News October 12, 2025

ఐటీఐ, డిగ్రీ అర్హతతో 87పోస్టులు

image

SJVN లిమిటెడ్‌లో 87 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో అసిస్టెంట్(అకౌంట్స్), డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, స్టోర్ కీపర్, సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. జాబ్‌ను బట్టి ఐటీఐ, డిగ్రీ, 8వ తరగతి (డ్రైవర్ పోస్టులకు)ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sjvn.nic.in/

News October 12, 2025

విశాఖ ఉక్కుకు ప్రభుత్వం అండ.. ₹2,400 కోట్లు..

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. విద్యుత్ ఛార్జీల విషయంలో ఉపశమనం కల్పించింది. EPDCLకు ప్లాంట్ చెల్లించాల్సిన ₹754 కోట్ల బకాయిలు, వచ్చే రెండేళ్ల ఛార్జీలతో కలిపి రూ.2,400 కోట్లను RINLలో ఈక్విటీ కింద పెట్టుబడిగా పెట్టే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మొత్తాన్ని నాన్‌ క్యుములేటివ్‌ రిడీమబుల్‌ ప్రిఫరెన్షియల్‌ వాటా మూలధనంగా EPDCLకు బదలాయించేందుకు ఓకే చెప్పింది.