News January 7, 2025
పుస్తకాల బరువు తగ్గించండి: నారా లోకేశ్
AP: స్కూలు విద్యార్థులకు పాఠ్యపుస్తకాల బరువు తగ్గించాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. స్కూలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేయాలన్నారు. ఉన్నత విద్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా మార్పులు చేపట్టాలని తెలిపారు.
Similar News
News January 8, 2025
అంధకార ఆంధ్రప్రదేశ్‌కు మోదీ రాకతో వెలుగులు: పవన్
AP: గత ఐదేళ్లు అవినీతి, అరాచక పాలనతో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ సభలో ఆరోపించారు. ఇవాళ మోదీ రాకతో రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. పీఎం సడక్ యోజన ద్వారా గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని, ఇంటింటికీ తాగు నీరు ఇస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో మోదీ వెలుగులు నింపుతున్నారని వెల్లడించారు.
News January 8, 2025
‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ విడుదల వాయిదా
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ ముందుగా ప్రకటించినట్లు ఈనెల 11న విడుదల కావట్లేదని మేకర్స్ ప్రకటించారు. 20 నిమిషాల వీడియోను కలపడంలో టెక్నికల్ సమస్యలు ఏర్పడటంతో వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 17నుంచి ఈ రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కాగా, సంక్రాంతి సందర్భంగా గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ విడుదల కానున్నాయి.
News January 8, 2025
APపై గోదావరి రివర్ బోర్డుకు TG ఫిర్యాదు
TG: పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఏపీ, కేంద్రం, గోదావరి రివర్ బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. ‘వరద జలాల ఆధారంగా గోదావరిపై ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురవుతుంది. నీటి వాటాలు తేలేవరకూ బనకచర్ల పనులు నిలిపేయాలి. ఇందుకు కేంద్రం, గోదావరి బోర్డు చర్యలు తీసుకోవాలి’ అని తెలంగాణ డిమాండ్ చేసింది.