News March 5, 2025

నీటి వృథా తగ్గించి.. కష్టాలు తీర్చేలా!

image

దేశంలోని ప్రధాన నగరాలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో ఫిబ్రవరి నుంచే నీటి ఎద్దడి మొదలైంది. ఈక్రమంలో అభిజిత్ సాథే అనే వ్యక్తి ‘గ్రే వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్’ను రూపొందించారు. దీనిద్వారా సింక్స్, వాషింగ్ మిషన్స్, షవర్స్ నుంచి వచ్చే యూజ్డ్ వాటర్‌ను రీసైక్లింగ్ చేస్తారు. వీటిని గార్డెనింగ్, టాయిలెట్లలో వాడుకోవచ్చు. దీని ద్వారా 40శాతం నీటి వృథాను తగ్గించవచ్చు.

Similar News

News December 10, 2025

రాజమండ్రి: విద్యాభివృద్ధిలో తరగతి పరిశీలన కీలకం- DEO

image

పాఠశాల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో దోహదపడే తరగతి పరిశీలన చిత్తశుద్ధితో నిర్వహించాలని DEO కె.వాసుదేవరావు సూచించారు. గత 2రోజులుగా స్థానిక దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న సీఆర్‌ఎంటీలు, ఉపాధ్యాయుల “టీచ్ టూల్ అబ్జర్వేషన్ శిక్షణ” తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

News December 10, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు విద్యార్థులు.. PHOTO GALLERY

image

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో విద్యార్థులు సందడి చేశారు. నిన్నటితో సమ్మిట్ ముగియగా ఇవాళ ఫ్యూచర్‌ సిటీలోని వేదిక వద్దకు స్టూడెంట్స్‌కు అధికారులు ఉచిత ప్రవేశం కల్పించారు. వారంతా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించారు. రోబో చేస్తున్న పనులను చూసి పారిశుద్ధ్య కార్మికులు ఆశ్చర్యపోయారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన గ్యాలరీలో చూడవచ్చు.

News December 10, 2025

వాస్తు ప్రకారం 4 మూలల్లో ఏమేం ఉండాలి?

image

ఇంటి మూలలు ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. దీని ప్రకారం.. ఇంటికి ఈశాన్య మూలలో గుంట(లోతు/నీరు), ఆగ్నేయ మూలలో మంట(వంటగది), నైరుతి మూలలో మెట్టగా(ఎత్తుగా, బరువుగా), వాయువ్య మూలలో గాలి(చలనం) ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది మంచి సంబంధాలకు, చలనానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>