News October 20, 2024
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,741 మంది భక్తులు దర్శించుకోగా, 31,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరింది.
Similar News
News December 2, 2025
ఖమ్మం: మమ్మల్ని కాస్త ‘గుర్తు’ పెట్టుకోండి..!

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేడి పెరిగి ప్రచార జోరు సాగుతోంది. గ్రామాల్లో ఉదయం నుంచే అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. గుర్తులు లేకున్నా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గుర్తులు వచ్చాక చెప్తాం కానీ.. మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆశీర్వదించండి’ అంటూ అభ్యర్థిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
News December 2, 2025
పుతిన్ పర్యటన.. ఈ విషయాలు తెలుసా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటన కోసం ఇండియాకు రానున్నారు. ఆయన ఇక్కడ ఉన్నంతసేపు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. తినేందుకు ఆహార పదార్థాలు, నీరు, ఇతర వస్తువులు రష్యా నుంచే తీసుకొస్తారు. క్రెమ్లిన్ చెఫ్ వండిన ఆహారాన్ని చెక్ చేసేందుకు ఓ మొబైల్ ల్యాబ్ ఏర్పాటుచేస్తారు. టాయ్లెట్నూ అక్కడి నుంచే తెచ్చి, మలమూత్రాలను తీసుకెళ్తారు. ఆయన ఫోన్ వాడరు. ప్రత్యేకమైన బూత్ నుంచే టెలిఫోన్లో మాట్లాడుతారు.
News December 2, 2025
కాంతార వివాదం: క్షమాపణలు చెప్పిన రణ్వీర్ సింగ్

కాంతార ఛాప్టర్-1 విషయంలో తలెత్తిన <<18445119>>వివాదంపై<<>> బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘ఆ చిత్రంలో రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడం మాత్రమే నా ఉద్దేశం. అలాంటి సీన్ చేయడం ఎంత కష్టమో ఓ నటుడిగా నాకు తెలుసు. ప్రతి సంస్కృతి, సంప్రదాయాన్ని నేను గౌరవిస్తా. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమాపణలు కోరుతున్నా’ అని పేర్కొన్నారు.


