News April 2, 2025
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. స్వామి వారి దర్శనానికి 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,981 మంది భక్తులు దర్శించుకోగా 21,120 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.5.09 కోట్ల ఆదాయం సమకూరింది.
Similar News
News April 3, 2025
సాయి సుదర్శన్ పరుగుల ప్రవాహం.. ఓ లుక్కేయండి!

35, 11, 20, 65*, 14, 22, 62*, 53, 19, 20, 47, 43, 96, 45, 37, 45, 33, 31, 35, 12, 31, 65, 84*, 6, 103, 74, 63, 49.. GT ఓపెనర్ సాయి సుదర్శన్ గత ఇన్నింగ్స్లో చేసిన పరుగులు ఇవి. IPLలో 28 ఇన్నింగ్స్ తర్వాత అత్యధిక పరుగులు(1220) చేసిన లిస్టులో షాన్ మార్ష్ తర్వాత స్థానంలో ఉన్నారు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడుతున్న ఇతను.. 2022లో GT ట్రోఫీ గెలవడంలోనూ కీలకపాత్ర పోషించారు.
News April 3, 2025
మోదీ నాకు గొప్ప స్నేహితుడే కానీ..: ట్రంప్

పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్.. PM మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాకు గొప్ప స్నేహితుడు. కానీ భారత్ మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు. మాపై 52 శాతం టారిఫ్ విధిస్తోంది. మేము ఇండియాపై 26% సుంకం విధిస్తున్నాం’ అని చెప్పారు. సుంకాల ప్రకటనతో అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు. US మార్కెట్లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.
News April 3, 2025
అసెంబ్లీ ఆవరణలో దొంగల చేతివాటం

AP: నిన్న ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా శాసనసభ ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్మన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలు, మరో వ్యక్తి జేబులో రూ.32వేలను కొట్టేశారు. మొత్తం రూ.4 లక్షలు చోరీ అయినట్లు భావిస్తున్నారు.