News June 3, 2024
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.66,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.72,110 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.700 తగ్గి రూ.97,300కు చేరింది.
Similar News
News January 22, 2026
భారత ప్లేయర్కు గాయం

న్యూజిలాండ్తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ ఇండియా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డారు. 16వ ఓవర్లో మిచెల్ కొట్టిన బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయన వేలికి గాయమైంది. చేతి నుంచి రక్తం రావడంతో నొప్పితో మైదానాన్ని వీడారు. గాయం తీవ్రత ఎక్కువైతే తర్వాతి మ్యాచుల్లో అక్షర్ ఆడేది అనుమానమే.
News January 21, 2026
నాకు ఆ చిన్న ఐస్ ముక్క చాలు.. గ్రీన్లాండ్పై ట్రంప్

దావోస్ వేదికగా నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘నేను కేవలం ఒక ఐస్ ముక్క మాత్రమే అడుగుతున్నాను. ఇందుకు నో అనేవారిని అస్సలు మర్చిపోను’ అని హెచ్చరించారు. గ్రీన్లాండ్ను దక్కించుకోవడానికి ఫోర్స్ను కూడా ఉపయోగించనంటూ పరోక్ష బెదిరింపులకు దిగారు. ఆ ప్రాంతాన్ని కాపాడడం తమకే సాధ్యమని, ఇంకెవరూ ఆ పని చేయలేరని చెప్పుకొచ్చారు.
News January 21, 2026
SONY ఠీవీ.. ఇక ఇంటికి రాదా?

TV బ్రాండ్ అనగానే విన్పించే SONY సంస్థ TCLతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఇకపై సోనీ బ్రాండ్ టీవీలు మార్కెట్లోకి రావా? అనే సందేహం నెలకొంది. అయితే SONY, BRAVIA పేర్లతోనే TCL టెలివిజన్ సెట్స్ తయారు చేయనుంది. భాగస్వామ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలో జపాన్ దిగ్గజానికి 49% వాటా, చైనా ప్రభుత్వం భాగస్వామిగా గల TCLకు 51% షేర్ ఉంటాయి. అయితే ప్రొడక్షన్ మారడంతో క్వాలిటీ తదితరాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.


