News October 28, 2024
రీఛార్జ్ రేట్లు తగ్గింపు?

BSNL దెబ్బకు ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జులైలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ రేట్లను పెంచడంతో లక్షలాది కస్టమర్లు BSNLకు మారుతున్నారు. దీంతో రేట్లను తగ్గించాలని ప్రైవేట్ కంపెనీలు భావిస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజును 8% నుంచి 0.5-1% తగ్గించాలని కోరుతున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
Similar News
News September 16, 2025
పంటకు అధిక యూరియాతో కలిగే నష్టాలు

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.
News September 16, 2025
ప్రీఎక్లంప్సియాను ముందుగానే గుర్తించొచ్చు!

కొందరు మహిళలకు ప్రెగ్నెన్సీలో మూత్రం నుంచి ప్రొటీన్ వెళ్లిపోతుంది. దీన్నే ప్రీఎక్లంప్సియా అంటారు. సరైన సమయంలో గుర్తించి, చికిత్స చేయకపోతే తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం వస్తుంది. దీనికోసం IITమద్రాస్ పరిశోధకులు ఒక టెస్ట్కిట్ అభివృద్ధి చేశారు. ఒక్కచుక్క రక్తంతో టెస్ట్ చేస్తే అరగంటలోనే ఫలితం వస్తుంది. P-FAB టెక్నాలజీతో ఇది పనిచేస్తుందని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ VV రాఘవేంద్రసాయి వెల్లడించారు.
News September 16, 2025
వరికి అధికంగా యూరియా వేస్తున్నారా?

వరి నాట్లు వేసిన 2-3 వారాల మధ్య.. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు రెండుసార్లు యూరియా వేయాలి. ప్రతిసారీ ఎకరాకు 35 నుంచి 45 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. చాలామంది రైతులు మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. అధిక యూరియా వల్ల అధిక దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతులు ఇలా చేస్తున్నారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.