News July 1, 2024
జూన్లో తగ్గిన యూపీఐ చెల్లింపులు!

మే నెలలో రికార్డ్ స్థాయిలో నమోదైన UPI చెల్లింపుల జోరు జూన్లో నెమ్మదించింది. లావాదేవీల్లో 1శాతం, వాల్యూలో 2శాతం తగ్గింపు నమోదైంది. మేలో 14.04 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరగగా జూన్లో ఆ మొత్తం 13.89 బిలియన్లుగా రికార్డ్ అయింది. లావాదేవీల విలువ ₹20.45 లక్షల కోట్ల నుంచి ₹20.07 లక్షల కోట్లకు తగ్గింది. మరోవైపు మే నెలతో పోలిస్తే IMPS లావాదేవీలు 5%, ఫాస్టాగ్ లావాదేవీలు 4% తగ్గాయి.
Similar News
News November 12, 2025
గజం రూ.3.40 లక్షలు.. 8 ఏళ్లలో 4 రెట్లు

TG: రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ(HKC)లో గజం ధర రూ.3.40 లక్షలు పలికినట్లు TGIIC ఎండీ శశాంక తెలిపారు. 2017లో అక్కడ రూ.88వేలుగా ఉన్న ధర ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. మొత్తం 4,770 గజాల స్థలాన్ని రూ.159 కోట్లకు విక్రయించామన్నారు. ఇక కోకాపేట, మూసాపేటలోని ఖాళీ ప్లాట్ల వేలం కోసం ప్రీబిడ్ సమావేశం ఈ నెల 17న టీహబ్లో నిర్వహించనున్నట్లు HMDA ప్రకటించింది.
News November 12, 2025
GOOD NEWS: ఎల్లుండి నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

APలోని దివ్యాంగులకు శుభవార్త. వారి వైకల్య నిర్ధారణకు ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని, గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు.
News November 12, 2025
నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. చికిత్స అనంతరం ఇవాళ ధర్మేంద్రను ఇంటికి పంపించారు.


