News September 20, 2025
పాల ప్రొడక్టుల ధరలు తగ్గింపు

AP: GST తగ్గడంతో తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు సంగం, విజయ డెయిరీలు ప్రకటించాయి. సంగం డెయిరీ UHT పాలు లీటరుపై రూ.2, పనీర్ కిలో రూ.15, నెయ్యి-వెన్న కిలోకి రూ.30, బేకరి ప్రొడక్టులు కిలోపై రూ.20 మేర తగ్గించనుంది. విజయ డెయిరీ టెట్రాపాలు లీటరు రూ.5, ఫ్లేవర్డ్ మిల్క్ లీటరుకు రూ.5, పన్నీర్ కిలో రూ.20, వెన్న-నెయ్యిపై కిలోకి రూ.30 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు SEP 22 నుంచి అమలులోకొస్తాయి.
Similar News
News September 20, 2025
న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. రూ.3.8 కోట్లు వసూలు

నాగర్‌కర్నూల్ (TG) జిల్లాకు చెందిన మల్లేశ్, భార్య మేరీ, స్నేహితురాలు లిల్లీ Xలో ‘సంయుక్త రెడ్డి’ పేరిట అకౌంట్ క్రియేట్ చేశారు. కర్నూలుకు చెందిన ఓ వ్యాపారిని పరిచయం చేసుకుని న్యూడ్ వీడియోలు పంపారు. ఓ మహిళతో వాట్సాప్ వీడియో కాల్స్ చేయించారు. ఆ తర్వాత తక్కువ ధరకే పొలాలు, ప్లాట్లు అమ్ముతామని నమ్మించారు. దాంతో పాటు బెదిరించి రెండేళ్లలో రూ.3.8 కోట్లు వసూలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
News September 20, 2025
ఇండియన్ల వద్దే 72శాతం H1B వీసాలు

అమెరికా ప్రభుత్వం జారీచేసే H1B వీసాలు అత్యధికంగా ఇండియన్ల వద్దే ఉన్నాయి. FY2022 వరకూ జారీచేసిన వాటిల్లో భారతీయుల వద్ద 72.6శాతం.. అంటే 3,20,791 వీసాలు ఉండటం గమనార్హం. ఆ తర్వాత చైనాకు చెందిన 55,038(12.5%) మంది వద్ద H1B వీసాలున్నాయి. అలాగే కెనడా వద్ద ఒక శాతం(4,235), సౌత్ కొరియా వద్ద 0.9శాతం(4,097) ఉండగా, ఫిలిప్పీన్స్ ప్రజలు 0.8శాతం (3,501) వీసాలు కలిగిఉన్నారు.
News September 20, 2025
క్లీనింగ్ ప్రొడక్ట్స్‌తో ఊపిరితిత్తులపై ప్రభావం: స్టడీ

ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే ప్రొడక్ట్స్ లంగ్స్‌ను సైలెంట్‌గా డ్యామేజ్ చేస్తాయని తాజా పరిశోధనలో తేలింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్‌లో ప్రచురించిన ఈ పరిశోధనలో 6వేల మంది పాల్గొన్నారు. బ్లీచ్, అమ్మోనియా తదితర క్లీనింగ్ ఉత్పత్తుల్లోని రసాయనాల వల్ల శ్వాసకోశ సమస్యలొస్తాయని, ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయని తేలింది. ఇది స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదంతో సమానం అని పేర్కొంది.