News September 18, 2024

కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. భారీగా పెరిగిన గోల్డ్ దిగుమతులు

image

గోల్డ్‌పై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాది AUGలో $4.83 బిలియన్ల విలువైన పసిడిని భారత్ ఇంపోర్ట్ చేసుకోగా, ఈ ఏడాది ఆగస్టులో ఆ మొత్తం $10.6 బిలియన్లకు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ భారీగా తగ్గినట్లు తెలిపింది. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% దిగుమతులు ఉన్నాయి.

Similar News

News December 17, 2025

APPLY NOW: ICMRలో 28 పోస్టులు

image

<>ICMR<<>> 28 సైంటిస్ట్-B పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.icmr.gov.in/

News December 17, 2025

టోనర్ ఎంపిక ఇలా..

image

ప్రస్తుతం స్కిన్‌కేర్‌పై అందరికీ అవగాహన పెరిగింది. దీంట్లో ముఖ్యమైనది టోనర్. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడిచర్మం ఉన్నవారు తేమను అందించే టోనర్, సున్నితచర్మం ఉన్నవారు కలబంద, చామంతి గుణాలున్నవి, జిడ్డు చర్మం ఉన్నవారు తాజాదనాన్ని కలిగించేవి ఎంచుకోవాలి. ఆల్కహాల్, పారాబెన్స్, బెంజైల్ పెరాక్సైడ్ వంటివి హాని చేస్తాయి. కాబట్టి టోనర్‌లో ఇవి లేకుండా చూసుకోవాలి. <<-se>>#SkinCare<<>>

News December 17, 2025

మీ బ్రెయిన్ వయస్సుని ఇలా తగ్గించుకోండి

image

వయస్సు పెరగడం సహజమే. కానీ బ్రెయిన్‌ను యవ్వనంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. USకు చెందిన ఫ్లోరిడా వర్సిటీ చేసిన అధ్యయనంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించిన వారి మెదడు వాస్తవ వయస్సు కంటే 8 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మంచి నిద్ర, సరైన బరువు, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, ఒత్తిడిని నియంత్రించడం వంటివి బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచినట్లు తేలింది. తద్వారా ఓల్డేజ్‌లో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు.