News August 13, 2024
రీల్స్ చేస్తూ బిల్డింగ్ పైనుంచి పడిపోయింది!

యువత సోషల్ మీడియాకు అడిక్ట్ అయి రీల్స్ ద్వారా వైరలయ్యేందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు. తాజాగా ఘజియాబాద్(UP)లోని ఇందిరాపురం సొసైటీలో ఓ యువతి ఆరో ఫ్లోర్ బాల్కనీలో నిలబడి రీల్స్ చేసేందుకు యత్నించింది. ఒక్కసారిగా తన చేతిలో నుంచి మొబైల్ జారిపోవడంతో పట్టుకునేందుకు ప్రయత్నించి ఆమె కూడా పడిపోయింది. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలా రీల్స్ చేసి వైరలవడం కంటే మంచి ర్యాంకు తెచ్చుకుని ఫేమస్ అవడం బెస్ట్.
Similar News
News January 21, 2026
ఆరావళి అక్రమ మైనింగ్.. కోలుకోలేని నష్టమన్న SC

ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్‌పై రివ్యూ చేసేందుకు ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అక్రమ మైనింగ్ కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. కమిటీ కోసం పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను 4 వారాల్లోగా ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణుల కమిటీ తమ పర్యవేక్షణలో పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయడాన్ని నిషేధించింది.
News January 21, 2026
ఎక్కువ కాలం జీవించాలంటే ఇలా చేయండి!

మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామనేది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్‌గా ఉండేవారు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనల్లో తేలిందని వివరిస్తున్నారు. అతిగా ఆందోళన చెందడం, నెగటివ్ ఆలోచనల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇది త్వరగా రోగాల బారిన పడేలా చేస్తుందని, అందుకే ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. SHARE IT
News January 21, 2026
ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు

TG: ‘FIR ఎట్ డోర్ స్టెప్’లో భాగంగా తొలి కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి(D) గాగిల్లాపూర్‌కు చెందిన వ్యక్తి తన విల్లాలో దొంగతనం జరిగినట్లు డయల్ 100కి ఫిర్యాదు చేయడంతో బాధితుడి ఇంటికి వెళ్లి FIR నమోదు చేశామన్నారు. మహిళలు, పిల్లలపై దాడులు, పోక్సో, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బాల్య వివాహాల వంటి ప్రత్యేక సందర్భాల్లో బాధితుల ఇంటి వద్దే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.


