News November 15, 2024
రైళ్లలో రీల్స్.. రైల్వే కీలక నిర్ణయం
రైళ్లు, రైల్వే స్టేషన్లు, కోచ్‌లలో రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రైల్వే నిర్ణయించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దేశంలోని అన్ని రైల్వే జోన్లకు సూచించింది. కాగా కదులుతున్న రైళ్లలో, పట్టాల పక్కన ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతుండటంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News November 16, 2024
రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు రాజురా, డిగ్రాస్, వార్ధాలో, ఎల్లుండి నాందేడ్, నాయగావ్, భోకర్, సోలాపూర్‌లో రోడ్ షోల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రేవంత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన విషయం తెలిసిందే.
News November 16, 2024
సోలార్ ఎనర్జీ రంగంలోకి మహేశ్ బాబు?
తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్‌టెక్ లిమిటెడ్)తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. కాగా మహేశ్ ఇప్పటికే రెయిన్‌బో హాస్పిటల్స్, ఏఎంబీ సినిమాస్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఇవి కాక పలు బ్రాండ్స్‌కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.
News November 16, 2024
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో NPP విజయం
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని వామపక్ష కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 225 స్థానాల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ 61.56% ఓట్లతో 159 సీట్లు గెలుచుకుంది. గతంలో ఈ కూటమికి పార్లమెంటులో మూడు సీట్లు ఉండేవి. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దిస్సనాయకే వెంటనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్లి తన హవాను కొనసాగించారు.