News June 4, 2024
కింగ్ మేకర్లుగా ప్రాంతీయ పార్టీలు!

కేంద్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సునాయాసంగా అధికారం చేపడుతుందనుకున్న BJP చెమటోడుస్తోంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ తారుమారు చేస్తోంది. దీంతో NDA, INDIA కూటమిలోని ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్లుగా మారనున్నాయి. TDP చీఫ్ చంద్రబాబు, SP చీఫ్ అఖిలేశ్, TMC అధ్యక్షురాలు మమతా బెనర్జీ, JDU అధినేత నితీశ్ కుమార్, DMK చీఫ్ స్టాలిన్ తదితరుల నిర్ణయంపై NDA, INDIA భవితవ్యం ఆధారపడి ఉంది.
Similar News
News December 4, 2025
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.
News December 4, 2025
ఇలా చేస్తే.. హ్యాకర్లకి చిక్కరు!

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హిస్టరీ డిలీట్ చేయడం, ప్రైవేట్ ట్యాబ్ ఉపయోగించడం నిజమైన రక్షణ కాదని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ప్రైవసీ కోసం జీరో-లాగ్ VPN వాడటం వల్ల బ్రౌజ్ చేసేటప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు. బ్రౌజింగ్కి వేర్వేరు డివైజ్లు ఉపయోగించడం వల్ల డేటా ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కుకీలను బ్లాక్ చేయాలి. ప్రతీ దానికి ఒకే మెయిల్ వాడకూడదు. పాస్వర్డ్లను మారుస్తూ ఉండాలి.
News December 4, 2025
160 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భోపాల్లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<


