News November 30, 2024

పాముకాటు కేసులు నమోదు చేయండి: కేంద్రం

image

పాముకాటు కేసులను గుర్తింపదగిన వ్యాధులుగా ప్రకటించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. సంబంధిత కేసులు, మరణాల నివేదికను తప్పనిసరి చేయాలని పేర్కొంది. పాము కాటు ప్రజా సమస్య అని, దీంతో మరణాలు, అనారోగ్యానికి కారణమవుతుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పాముకాటు సమస్యను నివారించడానికి జాతీయ కార్యచరణ ప్రణాళికను ఆవిష్కరించినట్లు తెలిపారు.

Similar News

News November 17, 2025

డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్‌లో మొబైళ్లు, కాన్పూర్‌లో సిమ్‌ల కొనుగోలు

image

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్‌లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్‌ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్‌తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్‌కు సోదరుడు.