News August 25, 2024
రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త టెక్నాలజీలపై ఫోకస్ చేయాలి: మంత్రి పొంగులేటి

TG: అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలకు సొంత భవనాలను రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న ఆఫీసుల అద్దెలు, విద్యుత్, రెంటెడ్ వాహనాల ఛార్జీలను త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా కొత్త టెక్నాలజీలపై ఫోకస్ చేయాలని సూచించారు.
Similar News
News March 27, 2026
పెంటగాన్‌లో పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. ఏం జరగబోతోంది?

US రక్షణ కార్యాలయం పెంటగాన్ చుట్టుపక్కల <<18781285>>పిజ్జా ఆర్డర్లు<<>> పెరిగితే ఏదో ఒక దేశానికి మూడినట్లేనని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. తాజాగా పాపా జాన్స్ ఆర్డర్లు 296%, డొమినోస్ 208%, పిజాటో ఆర్డర్లు 200% పెరిగాయి. పశ్చిమాసియాకు US మరిన్ని బలగాలను పంపనుందనే వార్తల నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. ‘కొన్ని గంటల్లో కీలక ప్రకటన’ అంటూ వైట్‌హౌస్ చేసిన ట్వీట్ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. అసలేం జరగబోతోంది?
News March 27, 2026
‘థాంక్యూ ఇండియా’ అని మిస్సైల్‌పై రాసి..

ఇజ్రాయెల్, అమెరికా దాడులకు మిస్సైళ్లతోనే ఇరాన్ సమాధానమిస్తోంది. ఈ క్రమంలో తమకు సంఘీభావం తెలిపిన దేశాలకు వినూత్నంగా కృతజ్ఞతలు చెబుతోంది. ‘థాంక్యూ జర్మన్ పీపుల్. థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’ అంటూ క్షిపణులపై సందేశాలు రాసి మరీ ప్రయోగిస్తోంది. స్పెయిన్, పాక్‌కూ ఇలానే థాంక్స్ చెప్పినట్లు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని US బేస్‌లపై ఈ దాడులు చేసినట్లు IRGC తెలిపింది.
News March 27, 2026
ఈ క్వాలిటీస్ ఉన్న మహిళలను పురుషులు ఇష్టపడతారు!

మహిళల్లోని కొన్ని క్వాలిటీలు పురుషులను ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు. ‘ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిని ఇష్టపడతారు. ఇండిపెండెంట్‌గా, దయతో ఉండే వారు నచ్చుతారు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పగల, తమ తప్పును ఒప్పుకోగల వారికి అట్రాక్ట్ అవుతారు. తమకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని, తాము కలగన్న వాటిని సాధించుకోవాలనుకునే వారిని పురుషులు లైక్ చేస్తారు’ అని చెబుతున్నారు.


