News October 23, 2024
ఆ 10 జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు

AP: వరద ప్రభావిత జిల్లాల్లో రూ.50 వేల వరకు రుణాలు రీషెడ్యూల్ చేసుకునేవారికి, రూ.50 వేలు కొత్తగా రుణం పొందే వారికి రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ, యూజర్ ఛార్జీల చెల్లింపుల నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. VZM, ప.గో, అల్లూరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, GNT, బాపట్ల, పల్నాడు, NTR జిల్లాల వారికి ఇది వర్తిస్తుంది. ఈ ఉత్తర్వులు ఆగస్టు 30 తరువాత నుంచి 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.
Similar News
News November 16, 2025
APPLY NOW: MECLలో ఉద్యోగాలు

మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<
News November 16, 2025
వేదాలను ఎందుకు అధ్యయనం చేయాలి?

వేదాలు అమూల్య రత్నాలు గల మహాసముద్రాల కంటే లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. అందుకే వాటిని అధ్యయనం చేయాలి. వీటిలో విశ్వ రహస్యాలు, సైంటిఫిక్ విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఇహ, పరలోకాల్లో శాశ్వత ఆనందాన్ని, సుఖాలను అందించే మార్గాన్ని చూపుతాయి. సామాన్య మానవుడిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మన జీవితాన్ని ఉన్నతంగా, సంతోషంగా మార్చుకోవడానికి, సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి వేదాలు చదవాలి. <<-se>>#VedikVibes<<>>
News November 16, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

గత వారంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్లో స్కిన్ లెస్ కేజీ రూ.210-230 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.230-240గా ఉంది. అటు ఏపీలోని విజయవాడలో రూ.250, గుంటూరులో రూ.260, ప.గో. జిల్లా భీమవరంలో రూ.230-250, ఏలూరులో రూ.230కి విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మటన్ కేజీ రూ.800కు పైగానే ఉంది. మరి మీ ఏరియాలో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


