News December 30, 2024
ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు: మంత్రి
APలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామన్నారు. భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్న చోట రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News January 2, 2025
పరిమితి లేకుండా సాగు చేసే అందరికీ రైతుభరోసా!
TG: సాగు చేసే రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని అభిప్రాయపడింది. సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగుభూములను ప్రభుత్వం గుర్తించనుంది. రైతుభరోసా కోసం జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. సంక్రాంతి (జనవరి 14) నుంచి ఈ స్కీంను అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.
News January 2, 2025
రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి జరిగే ఐదో టెస్టు నుంచి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచులో కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరిస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచుకు తాను దూరంగా ఉంటానని హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్‌కు స్వయంగా రోహితే చెప్పినట్లు సమాచారం. దీనిపై రేపు స్పష్టత రానుంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
News January 2, 2025
క్రీడల్లో ప్రతిభకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేస్తారు. 1991-92 నుంచి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా క్రీడల మంత్రిత్వ శాఖ అవార్డులకు ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి మెడల్, సర్టిఫికెట్‌తోపాటు ₹25 లక్షల నగదు బహుమతిని అందిస్తారు. ఈ <<15045667>>ఏడాది<<>> మనూభాకర్, గుకేశ్, ప్రవీణ్ కుమార్, హర్మన్‌ప్రీత్‌లను వరించింది.