News July 8, 2024
నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు
తెలంగాణలో తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 15 వరకు జరగనుంది. మొత్తం 173 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 70,307 అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం గమనార్హం. పలు కాలేజీలు కొన్ని బ్రాంచీల్లో సీట్లను పెంచేందుకు AICTE అనుమతి పొందడంతో 2, 3 విడతల కౌన్సెలింగ్ వరకు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Similar News
News January 17, 2025
హీరోపై దాడి.. నిందితుడి కోసం వేట, ఒకరి అరెస్టు
సైఫ్ అలీఖాన్పై కత్తి దాడి కేసు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు చివరిసారిగా ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్లో పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం వాసాయి-విరార్ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పోలీసు టీంలు వాసాయి, నల్లసోపారా, విరార్ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News January 17, 2025
పంచాయతీ కార్యదర్శులకు షాక్!
TG: నల్గొండ(D)లో అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరైన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును జిల్లా కలెక్టర్ బ్రేక్ చేశారు. దీంతో గైర్హాజరైన కాలానికి సంబంధించిన సర్వీసును వారు కోల్పోనున్నారు. దీని వల్ల సర్వీస్ రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల విషయంలో వారికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీరిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. పాత స్థానాల్లో కాకుండా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు.
News January 17, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.650 పెరిగి రూ.81,270కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.74,500 పలుకుతోంది. కేజీ వెండి రూ.1000 పెరిగి రూ.1,04,000కు చేరింది.