News September 12, 2025
రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు: జయప్రకాశ్ నారాయణ

AP: రాజకీయాన్ని తిట్టడం మనల్ని మనం అవమానించుకోవడమే అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. ‘నిజాయితీ గల, దాపరికాలులేని చర్చ ఎంతో అవసరం. అలాంటి వేదికను ఏర్పాటు చేసిన వే2న్యూస్‌కు అభినందనలు. రాజకీయ నాయకులపై బురద చల్లడం, తిట్టడం చేస్తాం. కానీ కనిపిస్తే వంగి దండాలు పెడతాం. అతి వినయం, అవమానించడం అవసరం లేదు. రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు’ అని తెలిపారు.
Similar News
News September 12, 2025
RMPలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి: శ్రీహరి

AP: గుంటూరు(D) తురకపాలెంలో AP మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ శ్రీహరి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పర్యటించారు. ‘చికిత్స కోసం వైద్య శిబిరానికి వచ్చే వారి సంఖ్య తగ్గింది. పరిస్థితి అదుపులోనే ఉంది. స్థానిక RMP అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చాడు. RMPలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. లేకపోతే చర్యలు తీసుకుంటాం’ అని శ్రీహరి హెచ్చరించారు. తురకపాలెంలో ఇటీవల వరుస మరణాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
News September 12, 2025
రేపు గ్రూప్-2 మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG: 783 గ్రూప్-2 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను TGPSC ప్రకటించింది. రేపు ఉదయం 10.30 గంటల నుంచి HYD నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ప్రారంభమవుతుందని తెలిపింది. అభ్యర్థులు హాజరయ్యాక ఇంకా ఏవైనా పత్రాలు పెండింగ్‌లో ఉంటే ఈనెల 15న సమర్పించొచ్చని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.inలో చూడొచ్చు.
News September 12, 2025
అవినీతిని అడ్డుకునేందుకు AI మినిస్టర్.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోనే ఏఐ ఆధారంగా పనిచేసే మంత్రిని అల్బేనియా దేశం నియమించింది. ఈ ఏఐ మహిళా మంత్రికి ‘డియెల్లా’ అని పేరు పెట్టింది. ఈమె అన్ని ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తారు. దీనిద్వారా అల్బేనియా ప్రభుత్వం అవినీతిని తగ్గించొచ్చని భావిస్తోంది. అల్బేనియాలో ప్రభుత్వ టెండర్లు & ప్రజా నిధుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.