News October 22, 2024

టీడీఆర్ బాండ్ల ఆన్‌లైన్ పోర్టల్ పున:ప్రారంభం

image

AP: టీడీఆర్ బాండ్ల వినియోగానికి ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం పున:ప్రారంభించింది. ఇకపై ఆన్‌లైన్‌ దరఖాస్తులను అధికారులు పరిశీలనకు తీసుకోనున్నారు. అపార్ట్‌మెంట్లలో అదనపు ఫ్లోర్లు వేసుకోవడానికి ఉద్దేశించిన ఈ బాండ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. సర్వే నంబర్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని మార్కెట్ విలువ ఆధారంగా కొత్త TDR బాండ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.

Similar News

News January 30, 2026

కొమ్మ కత్తిరింపుల వల్ల కోకో పంటలో లాభమేంటి?

image

కోకో తోటల్లో రెండేళ్ల వరకు మొక్క సింగిల్ కొమ్మతో పెరిగేలా చూడాలి. పంట నాటిన మూడేళ్ల తర్వాత కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. మే 15 – జులై 15లోపు ప్రధాన కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల SEP,OCT,NOV నెలల్లో పూత బాగా వస్తుంది. నేలను చూసే కొమ్మలను, నేల నుంచి 3 అడుగుల వరకు కొమ్మలు లేకుండా కత్తిరించాలి. పదేళ్లు దాటిన తోటల్లో చెట్లు 7 అడుగులలోపే ఉండేలా చూడాలి. దీని వల్ల కాయ పెరుగుదల బాగుంటుంది.

News January 30, 2026

418 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

తమ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో 418 ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్ మేనేజ్‌మెంట్, తదితర విభాగాల్లో ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News January 30, 2026

400 మీటర్లకు రూ.18వేల ఛార్జ్.. ఆటో డ్రైవర్ అరెస్ట్

image

అర్జెంటీనా అరియానో అనే అమెరికన్ టూరిస్ట్‌కు ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టు నుంచి 400 మీటర్ల దూరంలోని హోటల్‌కు తీసుకెళ్లడానికి ఆటోడ్రైవర్ ఏకంగా ₹18,000 తీసుకున్నట్లు ఆటో నంబర్ రికార్డు చేసి మరీ Xలో పోస్ట్ చేశారు. చాలాసేపు ఆటోలో తిప్పాడని, పైగా మధ్యలో ఆపి డబ్బిచ్చిన తర్వాతే హోటల్లో దిగబెట్టాడని తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు అతణ్ని దేశ్‌రాజ్ యాదవ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.