News July 4, 2024
VRAలకు ఊరట.. వివిధ హోదాల్లో సర్దుబాటు

TG: సాంకేతిక కారణాలతో ఇప్పటికీ VRAలుగా కొనసాగుతున్న 154 మందికి ప్రభుత్వం ఊరట కలిగించింది. వారిని వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్హతల ఆధారంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ హోదాల్లో సర్దుబాటు చేసి జిల్లాలు, శాఖలను కేటాయించింది. ఈమేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
Similar News
News March 28, 2026
DMK ఫస్ట్ లిస్ట్.. OPSకు సీటు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో CM స్టాలిన్ DMK తొలి జాబితాను విడుదల చేసిన <<19500787>>విషయం<<>> తెలిసిందే. మాజీ CM, AIADMK నుంచి ఇటీవల ఆ పార్టీలో చేరిన O పన్నీర్ సెల్వమ్‌కు బోడినాయక్కనూర్ సీటు కేటాయించారు. ఆయన అనుచరులు స్టాలిన్-కొలతూర్, ఉదయనిధి-చెపాక్ నుంచి బరిలోకి దిగనున్నారు. స్టాలిన్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని ఇటీవల OPS వ్యాఖ్యానించారు. <<-se>>#ELECTIONS2026<<>>
News March 28, 2026
ఈవీల సబ్సిడీని పొడిగించిన కేంద్రం

విద్యుత్ వాహనాలు కొనేవారికి గుడ్ న్యూస్. ఈ నెలాఖరుతో పూర్తికానున్న సబ్సిడీని కేంద్రం పొడిగించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ సబ్సిడీలను ఈ ఏడాది జులై 31 వరకు, ఇ-రిక్ష, ఇ-కార్టుల సబ్సిడీలను 2028 మార్చి 31వరకు పొడిగించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు సబ్సిడీ కింద 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్స్ విక్రయించినట్లు అంచనా వేసింది. 2024 అక్టోబర్ 1న ఈ పీఎం-ఇడ్రైవ్ పథకం ప్రారంభమైంది.
News March 28, 2026
పాత్రలు కడిగే లిక్విడ్స్‌తో ఆరోగ్యానికి ముప్పు!

పాత్రలు కడిగే లిక్విడ్స్‌లో ఉండే ఐసోథియాజోలినోన్ వంటి రసాయనం వల్ల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా క్లీన్ చేయని పాత్రలపై ఇవి ఉండిపోవడం వల్ల చర్మ వ్యాధులు, అలర్జీలు, జీర్ణకోశ సమస్యలు తలెత్తవచ్చని వివరించారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వీటికి బదులుగా రసాయనాలు లేని <<19500089>>ప్రత్యామ్నాయాలు<<>> వాడాలని సూచించారు.


