News April 17, 2024
అడ్మిట్ కార్డులు విడుదల

ఛార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే నెలలో జరిగే ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్షల అడ్మిట్ కార్డులు https://eservices.icai.orgలో అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరినా ఢిల్లీ హైకోర్టు అంగీకరించలేదు.
Similar News
News February 1, 2026
కిచెన్ గార్డెన్‌కి ఈ మొక్కలు సెట్

ఇంటి తోటలోనే కాకుండా వంటింట్లో ఖాళీ స్థలం ఉంటే అక్కడా మనకు కావాల్సిన పచ్చదనాన్ని పెంచేయొచ్చు. ఆ మొక్కలేవో చూసేద్దాం రండి. వామాకు, కొత్తిమీర, పుదీనా, తులసి వంటి మొక్కలు సులువుగా, తక్కువ ఎండలో కూడా పెరుగుతాయి. వీటిని కిచెన్ గార్డెన్‌లో పెంచడం వల్ల ఆరోగ్యంతో పాటు గాలి కూడా శుద్ధి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
News February 1, 2026
డ్యూటీలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం ఆవేదన

TG: నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ <<19017490>>సౌమ్య<<>> మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
News February 1, 2026
కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/


