News November 19, 2024

లోకేశ్ చొరవతో అయ్యప్ప భక్తుల విడుదల

image

AP: జీడి నెల్లూరు నియోజకవర్గం గొడుగుచింతకు చెందిన అయ్యప్ప భక్తులు కేరళ వెళ్తుండగా వాహనానికి ప్రమాదం జరిగింది. అక్కడి పోలీసులు స్టేషన్లో ఉంచగా, తమను ఆదుకోవాలని వారు సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్‌ను కోరారు. సురక్షితంగా తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అక్కడి అధికారులతో లోకేశ్ టీం మాట్లాడగా, వారిని పోలీసులు విడిచిపెట్టారు. దీంతో అయ్యప్ప భక్తులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 15, 2025

14 గంటలు, 28 ఆర్డర్లకు రూ.762.. వైరల్

image

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ తన రోజువారీ సంపాదనపై చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఒక రోజులో 28 ఆర్డర్లు డెలివరీ చేసి ఇన్సెంటివ్స్‌తో కలిపి రూ.762 సంపాదించానని తెలిపాడు. ఇందుకోసం 14 గం. కష్టపడ్డానని చెప్పాడు. అయితే ఇది చాలా తక్కువ సంపాదన అని, బ్లింకిట్ శ్రమ దోపిడీకి పాల్పడుతోందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. క్విక్ కామర్స్ వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని మరికొందరు అంటున్నారు. COMMENT?

News December 15, 2025

విజయ్ హజారే ట్రోఫీ అందరూ ఆడాల్సిందే: BCCI

image

డిసెంబరు 24 నుంచి ప్రారంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీలో జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా పాల్గొనాలని BCCI స్పష్టం చేసింది. కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోహ్లీ, రోహిత్‌లకి మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుందని తెలిపింది. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గాయాలతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్‌కు మినహాయింపు ఉంది.

News December 15, 2025

హిమాలయాల్లో అణు పరికరం.. పొంచి ఉన్న ప్రమాదం!

image

1965లో చైనా అణు కార్యక్రమంపై నిఘా కోసం అమెరికా CIA భారత్‌తో కలిసి హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరం ఏర్పాటుచేయాలని భావించింది. మంచు తుఫానుతో ప్లుటోనియం ఉన్న పరికరాన్ని అక్కడే వదిలేశారు. తర్వాత వెళ్లి వెతికినా అది కనిపించలేదు. హిమానీనదాలు కరిగి ఆ పరికరం దెబ్బతింటే నదులు కలుషితం అవ్వొచ్చని సైంటిస్టులు తెలిపారు. తాజాగా బీజేపీ MP నిశికాంత్ ట్వీట్‌తో ఈ వార్త వైరలవుతోంది.