News May 3, 2024
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

TG: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర అవసరాల మేరకు దీన్ని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘గత హామీ మేరకు ITIR ప్రాజెక్టును ప్రారంభిస్తాం. భద్రాచలం వద్ద APలో విలీనమైన 5గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతాం. సైనిక పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమను నిర్మిస్తాం’ అని తెలిపారు.
Similar News
News November 27, 2025
నిర్మాతలను బ్లేమ్ చేయొద్దు: SKN

కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రొడ్యూసర్స్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులనుద్దేశించి నిర్మాత SKN పేర్కొన్నారు. ‘మనం కంఫర్ట్, లగ్జరీ కావాలి అనుకున్నప్పుడే ఎక్కువ పే చేయాలి. కేవలం కంఫర్ట్ కోసమే ఎక్స్ట్రా చెల్లిస్తున్నాం. లగ్జరీ థియేటర్లో చూడాలంటే రియల్ఎస్టేట్ వాల్యూ ప్రకారం టికెట్, రిఫ్రెష్మెంట్ రేట్లుంటాయి. వాటితో నిర్మాతకొచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు’ అని తెలిపారు.
News November 27, 2025
ఈనెల 29న ఆన్లైన్ జాబ్ మేళా

AP: పార్వతీపురం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆన్లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా HDB ఫైనాన్స్ కంపెనీలో 41 బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. 18ఏళ్లు పైబడిన డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/vtBSqdutNxUZ2ESX8
News November 27, 2025
కడప బౌలర్ శ్రీచరణికి రూ.1.3 కోట్లు

WPL మెగావేలం-2026లో తెలుగు ప్లేయర్ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది. ఈ కడప బౌలర్ను రూ.1.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇటీవల వన్డే ప్రపంచకప్లో శ్రీచరణి రాణించి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాను రూ.50 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది.


