News March 24, 2024

111 మందితో ఐదో జాబితా విడుదల

image

బీజేపీ 111 మందితో ఐదో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నవీన్ జిందాల్‌(కురుక్షేత్ర), కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు చోటు కల్పించింది. వీరితో పాటు కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్(పాట్నా సాహిబ్), గిరిరాజ్ సింగ్(బెగుసరాయ), ధర్మేంద్ర ప్రధాన్‌(సంబల్‌పూర్)తో పాటు మేనకా గాంధీ(సుల్తాన్‌పూర్), హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్(దుమకా) జాబితాలో ఉన్నారు.

Similar News

News December 28, 2025

సీఎం రేవంత్‌ కీలక సమీక్ష.. వ్యూహం సిద్ధం!

image

TG: అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో CM రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో నదీజలాల పంపకం, TG వాటా, APతో వివాదాలు, BRS హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

News December 28, 2025

ట్రైలర్ ఏది ‘రాజాసాబ్’?

image

నిన్న ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్‌ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తీరా చివరివరకు వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈవెంట్ చివర్లో ట్రైలర్ రేపు వస్తుందని ప్రభాస్ అనౌన్స్ చేశారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి. ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు నెట్టింట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News December 28, 2025

రాత్రి పడుకునే ముందు పాలు తాగితే..

image

రాత్రి సరిగా నిద్ర రావడం లేదని బాధపడేవారు పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర వస్తుంది. పాలలో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే కాల్షియం, విటమిన్ D, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పసుపు కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.