News September 22, 2024
వంట పాత్రల కొనుగోలుకు నిధుల విడుదల

TG: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే వంట పాత్రల కొనుగోలుకు విద్యాశాఖ నిధులు విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూల్‌కి రూ.10వేల నుంచి రూ.25 వేలు కేటాయించింది. మొత్తంగా రూ.23.76 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పథకం నిర్వహణ కోసం 23 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకునేందుకు డీఈవోలకు అనుమతినిచ్చింది.
Similar News
News November 21, 2025
BREAKING: జనగామ: ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ DEE

జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ డీఈఈ కూనమల్ల సంధ్యారాణి రూ.10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కింది. ఓ బాధితుడి వద్ద బిల్లు విషయమై రూ.10,000 లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 21, 2025
టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్‌లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
News November 21, 2025
కొత్త లేబర్ కోడ్‌లో ఉపయోగాలు ఇవే..

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్లు
* ఫిక్స్ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి


