News November 12, 2024
GATE పరీక్షల షెడ్యూల్ విడుదల

GATE-2025 పరీక్షల షెడ్యూల్‌ను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనుంది. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 30 పేపర్లను నిర్వహించనుండగా, అభ్యర్థులకు ఒకటి లేదా రెండు పేపర్లు రాసేందుకు అవకాశం ఉంది.
Similar News
News December 1, 2025
13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

IBPS రీజినల్ రూరల్ బ్యాంక్‌లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్/రూల్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://www.ibps.in/
News December 1, 2025
మేడారం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించండి: CM

TG: మేడారం అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘అభివృద్ధి పనుల్లో ఆచార సంప్రదాయాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పొరపాట్లు దొర్లితే కఠిన చర్యలు తీసుకుంటాం. రాతి పనులు, రహదారులు, గద్దెల చుట్టూ రాకపోకలకు మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు ఇలా ప్రతి అంశంపై CM అధికారులకు సూచనలు చేశారు.
News December 1, 2025
సజ్జ రైతులకు దక్కని మద్దతు ధర

AP: సజ్జలను పండించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అక్టోబరులో మొంథా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట నాణ్యత, దిగుబడి తగ్గింది. చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775గా ఉంటే.. నాణ్యత సరిగా లేదని రూ.1800 కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జలను సాగు చేశారు.


