News July 6, 2024

11న IIIT జనరల్ కౌన్సెలింగ్ జాబితా విడుదల

image

AP: RGUKT పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో జనరల్ కౌన్సెలింగ్‌కు ఎంపిక చేసిన విద్యార్థుల తుది జాబితా ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు ప్రత్యేక కేటగిరీలకు చెందిన దరఖాస్తుల పరిశీలన పూర్తైంది. నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లకు ఎంపికైన విద్యార్థులు జులై 22, 23 తేదీల్లో, ఒంగోలులో ఈ నెల 24, 25న, శ్రీకాకుళంలో 26, 27 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి.

Similar News

News November 26, 2025

భారత్ చెత్త రికార్డు

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడిన టీమ్ ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్టు క్రికెట్‌లో రన్స్ పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద పరాజయం. 2004లో 342(vsAUS), 2006లో 341(vsPAK), 2007లో 337(vsAUS), 2017లో 333(vsAUS) పరుగుల తేడాతో IND ఓడిపోయింది. తాజా ఓటమితో WTC 2025-27 సీజన్‌లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. తొలి 4 స్థానాల్లో ఆసీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాక్ ఉన్నాయి.

News November 26, 2025

ధర్మబద్ధమైన మార్గంలో నడిపించే నామం

image

విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్ ||
జయశీలుడు, విశ్వమంతా వ్యాపించినవాడు, మహేశ్వరుడు, అనేక రూపాలలో దుష్టులను సంహరించినవాడు, ఉత్తమ పురుషుడైన ఆ విష్ణు దేవునికి భక్తితో నమస్కరించాలని ఈ శ్లోకం చెబుతోంది. ఫలితంగా శ్రీవారి అనుగ్రహంతో అనేక కష్టాలు, సవాళ్లను జయిస్తామని ప్రతీతి. ఈ విష్ణునామం మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 26, 2025

RRCATలో 150 పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు తేదీ

image

రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ(<>RRCAT<<>>)లో 150 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. 18- 24ఏళ్లు ఉండి, ITI అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NAPS అప్రెంటిస్ పోర్టల్ https://www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11,600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.rrcat.gov.in/