News July 8, 2024

ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు విడుదల

image

TG: గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. తెలంగాణ విద్యా విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సహా మరికొన్ని విభాగాల్లో అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కాయి. సరైన అభ్యర్థులు లేక 16 ఉద్యోగాలు, కోర్టు కేసులతో 19, వేర్వేరు కారణాలతో మరికొన్ని ఉద్యోగాల భర్తీ నిలిచిపోయింది. ఫలితాల కోసం <>ఇక్కడ <<>>క్లిక్ చేయండి.

Similar News

News October 6, 2024

ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా?: CM

image

TG: 20ఏళ్లుగా పేదల్లో ఉన్న తనకు పేదోడి దుఃఖం తెలియదా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా? ZP మెంబర్ నుంచి సీఎం అయ్యాను. వాళ్లందర్నీ ఎలా ఆదుకోవాలో చెప్పండి. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు చేసింది. పేదల కోసం మరో రూ.10వేల కోట్లు అప్పు చేద్దాం. KCRకు 1000ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. BRS ఖాతాలో రూ.1500కోట్లున్నాయి. అదంతా పేదల డబ్బే’ అని రేవంత్ అన్నారు.

News October 6, 2024

ఈరోజు మయాంక్‌కి చోటివ్వాల్సిందే: ఆకాశ్ చోప్రా

image

బంగ్లాదేశ్‌తో ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ లెవన్‌లో మయాంక్ యాదవ్‌ను ఆడించాల్సిందేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. ‘మయాంక్ లాంటి ఫాస్ట్ బౌలర్‌ను స్క్వాడ్‌లోకి తీసుకుంటే కచ్చితంగా ఆడించాల్సిందే. తన ఫస్ట్ క్లాస్ మ్యాచుల రికార్డును పట్టించుకోకుండా జాతీయ జట్టుకి తీసుకున్నారు. అలాంటప్పుడు అతడికి అవకాశం ఇవ్వాల్సిందే. కత్తిని కొనేది దాచుకునేందుకు కాదుగా?’ అని ప్రశ్నించారు.

News October 6, 2024

90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చాం: CM రేవంత్

image

TG: గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్‌కు అండగా నిలిచి గెలిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కొత్తగా నియమితులైన ఇంజినీర్లకు హైదరాబాద్‌లోని శిల్పారామంలో సీఎం నియామకపత్రాలు అందించారు. ఉద్యోగుల కళ్లలో సంతోషం చూడాలనే దసరాకు ముందు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.