News October 15, 2024
లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

AP: లాసెట్ ప్రవేశాల షెడ్యూల్‌ను నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య గంగాధర్ విడుదల చేశారు. లాసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులంతా ఈ నెల 16 నుంచి 20 లోపు రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ చేయించుకోవాలన్నారు. 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 26న మార్పులు, 28న సీట్లు కేటాయిస్తామని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు 29, 30 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలన్నారు.
Similar News
News November 15, 2025
ఆలుమగల కలహం, ఆరికకూడు వంట

భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలు, అరికల (కొర్రలు) అన్నం వండడానికి పట్టేంత తక్కువ సమయంలోనే సద్దుమణుగుతాయని ఈ సామెత చెబుతుంది. భార్యభర్తల మధ్య కలహాలు దీర్ఘకాలం ఉండవు. అవి తాత్కాలికమైనవి. త్వరగా సమసిపోతాయి. ఆ కలహాలు వారి మధ్య అనురాగాన్ని మరింత పెంచుతాయి. అలాగే కొర్రల అన్నం కూడా తక్కువ సమయంలోనే సిద్ధమై ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ సామెత అర్థం.
News November 15, 2025
16 ఏళ్ల నిరీక్షణకు తెర.. నవీన్‌కు తొలి విజయం

TG: పదహారేళ్ల రాజకీయ జీవితంలో నవీన్ యాదవ్ తొలిసారి గెలుపు రుచి చూశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో ఎప్పుడూ ‘నవీన్.. కంటెస్టెడ్ MLA’ అని ఉండేది. ఇప్పుడు అది ‘నవీన్.. MLA’గా మారింది. 2009లో MIMతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన రెండుసార్లు కార్పొరేటర్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎట్టకేలకు ఈసారి జూబ్లీహిల్స్‌ను ‘హస్త’గతం చేసుకున్నారు.
News November 15, 2025
ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించండి: హైకోర్టు

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 6 నెలల్లోగా రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెగా డీఎస్సీ 671వ ర్యాంకు సాధించిన రేఖ ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. తమకు పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది.


