News July 11, 2024

ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు మెరిట్‌ లిస్ట్‌ విడుదల

image

AP RGUKT పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలైంది. ఛాన్స్‌లర్ ఆచార్య కేసిరెడ్డి లిస్టును విడుదల చేశారు. మొత్తం నాలుగు వేల సీట్లు ఉండగా ఈ ఏడాది ఏకంగా 53,863 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. www.rgukt.in వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ చేసుకుని నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు సూచించారు.

Similar News

News January 20, 2025

జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనం మార్పు

image

AP: వైఎస్ జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. గతంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఈ కేసులను విచారించగా, 12 ఏళ్లుగా ట్రయల్ అడుగు కూడా ముందుకు కదలలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తరఫు న్యాయవాది వాదించారు. దీంతో జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనానికి ట్రయల్‌ను మార్చింది.

News January 20, 2025

దమ్ముంటే ఐదేళ్ల వైసీపీ పాలనపై విచారణ జరిపించండి: షర్మిల

image

AP: గత 5ఏళ్ల పాలన ఓ విపత్తు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ‘ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉంది మీరే కదా? భారీ స్థాయిలో అవినీతి జరిగితే ఎందుకు బయటపెట్టలేదు? రాజధాని లేకుండా పాలన సాగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్ మీరు ఆడించినట్లు ఆడినందుకా? మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి’ అని అమిత్ షాను డిమాండ్ చేశారు.

News January 20, 2025

కాలేజీకి వెళ్లమన్నారని చనిపోయింది

image

TG: మెదక్ జిల్లా పొడ్చన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థిని సింధూజ(19) ఆత్మహత్య చేసుకుంది. నెల రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. దీంతో నిన్న పేరెంట్స్ కళాశాలకు వెళ్లాలని ఒత్తిడి చేశారు. మనస్తాపానికి గురైన సింధూజ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది.