News August 3, 2024
నీట్ యూజీ రాష్ట్ర ర్యాంకుల విడుదల

AP: 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించి నీట్ యూజీలో 43,788 ర్యాంకుల్ని NTA ప్రకటించింది. 720 మార్కులకు గాను అన్‌రిజర్వుడు/EWS కేటగిరీకి 162, OBC/SC/ST విభాగాలకు 161-127, OBC/SC/ST(PWD) కేటగిరీలకు 143-127 మార్కుల్ని కటాఫ్‌గా ప్రకటించారు. ఇక వైద్యవిద్య కోర్సుల్లో అఖిల భారత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. అది ముగిశాక రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు.
Similar News
News April 1, 2026
చికెన్ తింటున్నారా?

TGలో ఇవాళ్టి నుంచి చికెన్ షాపుల <<19529303>>బంద్<<>> కొనసాగనుంది. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. తాజా చికెన్ దొరక్కపోతే నిల్వ ఉంచిన మాంసాన్ని వాడే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మాంసంపై బాక్టీరియా చేరుతుంది. ఇలాంటి మాంసం తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్‌వెజ్ ప్రియులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
News April 1, 2026
భారీగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ కూడా షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,970 పెరిగి రూ.1,51,480కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,850 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.15వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది.
News April 1, 2026
రెండుమూడు వారాల్లో యుద్ధం ఆపేస్తాం: ట్రంప్

ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తున్న US వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రానున్న 2-3 వారాల్లో సైనిక చర్య ఆపనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌ను ముగించడానికి టెహ్రాన్‌తో దౌత్య ఒప్పందం అక్కర్లేదన్నారు. ఈలోగా అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకొనే సామర్థ్యాన్ని ఆ దేశం కోల్పోతుందని చెప్పారు. ఇక ఇరాన్‌పై అప్డేట్ ఇవ్వడానికి ట్రంప్ బుధవారం 9pm(US కాలమానం)కు ప్రసంగిస్తారని వైట్‌హౌస్ తెలిపింది.


