News July 29, 2024
CAT-2024 నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లలో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 5 నుంచి 24 వరకు అడ్మిట్ కార్డుల డౌన్లోడ్కు అవకాశం. నవంబర్ 24న పరీక్ష నిర్వహిస్తారు. జనవరిలో ఫలితాలు ప్రకటిస్తారు. జనరల్ అభ్యర్థులకు రూ.2500, ఎస్సీ, ఎస్టీలకు రూ.1250గా ఫీజు నిర్ణయించారు.
Similar News
News January 15, 2026
సంక్రాంతి స్పెషల్ బస్సులు.. రూ.100 కోట్ల ఆదాయం

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా TGSRTC ఈ నెల 9 నుంచి 14 వరకు 6 వేలకు పైగా స్పెషల్ బస్సులు నడిపింది. ఈ ఆరు రోజుల్లో సుమారు 2.40 కోట్ల మంది ప్రయాణించడం ద్వారా రూ.100 కోట్ల వరకూ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈసారి APSRTC బస్సులు హైదరాబాద్కు రాకపోవడం కూడా కలిసొచ్చింది. పండుగ తర్వాత జనవరి 18, 19 తేదీల్లోనూ స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.
News January 15, 2026
మార్స్ కోసం ఆహారం.. రూ.6.75 కోట్ల ఆఫర్

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్: మార్స్ టు టేబుల్’ అనే ఛాలెంజ్ను ప్రారంభించింది. మార్స్కి ప్రయాణించే ఆస్ట్రోనాట్ల కోసం వేరే గ్రహంపై కూడా పెరిగి, వండుకొని తినగలిగే ఆహారం రూపొందించే వారికి 7.5 లక్షల డాలర్లు (సుమారు రూ.6.75 కోట్లు) ఇస్తామని NASA ప్రకటించింది. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలని సూచించింది. ప్రపంచంలోని ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపింది.
News January 15, 2026
టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ

NZతో జరిగే 5 మ్యాచ్ల T20 సిరీస్కు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్.. ఇప్పుడు టీ20లకు సైతం అందుబాటులో ఉండటం లేదు. జనవరి 21 నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న T20 వరల్డ్కప్కు ముందు ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది.


