News March 19, 2024
హోం ఓటింగ్‌కు నోటిఫికేషన్ విడుదల
AP: మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతిస్తారు. పోలింగ్ తేదీకి 10 రోజుల ముందే ఇంటి నుంచి వారు ఓటు వేయవచ్చు. ఆ ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్సుల్లో ఉంచుతారు.
Similar News
News November 24, 2024
IPLలో రికార్డ్ ధరలు.. ఇద్దరూ ఇండియన్సే!
రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ IPL-2025 వేలంలో రికార్డు ధర పలికారు. పంత్‌ను లక్నో రూ.27 కోట్లు, అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన వీరిద్దరూ టీమ్‌ఇండియా బ్యాటర్లు కావడం విశేషం. మొన్నటి వరకు స్టార్క్ రూ.24.75 కోట్లతో ఖరీదైన ప్లేయర్‌గా ఉన్నారు. ఇండియన్ లీగ్‌లో ఇతర దేశాల ప్లేయర్లకు భారీగా వెచ్చించడం పట్ల గతంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
News November 24, 2024
అక్కడ ఆఫీసర్ల కంటే ఖైదీలకే జీతాలెక్కువ..!
యూకేలోని జైళ్లలో ఖైదీల ఆదాయం అక్కడి అధికారులు, టీచర్ల కంటే ఎక్కువగా ఉంది. ఒక్కో ఖైదీ ఏడాదికి సుమారుగా రూ.39 లక్షలు సంపాదిస్తారు. కొంచెం పని తక్కువ చేసే ఖైదీలు ఏటా రూ.24 లక్షలు గడిస్తారు. ఇది అక్కడి జైలు గార్డు జీతంతో దాదాపుగా సమానం. గార్డులకు రూ.29 లక్షల వరకు జీతమిస్తారు. కాగా అక్కడి ఖైదీలు జైల్లో నుంచి బయటకు వెళ్లి పనులు చేసుకోవచ్చు. లారీ, బస్సు డ్రైవర్లుగా కూడా వారు పనిచేస్తున్నారు.
News November 24, 2024
పంజాబ్ కింగ్స్‌పై క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
PBKS ఫ్రాంచైజీపై క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ సంచలన ఆరోపణలు చేశారు. IPLలో ఆ జట్టులో మళ్లీ ఆడటం తన వల్ల కాదని తేల్చిచెప్పారు. గౌతమ్ 2020లో పంజాబ్ తరఫున ఆడారు. ‘నేను ఏ జట్టుకు ఆడినా నా 100 శాతం ప్రదర్శన ఇస్తాను. కానీ పంజాబ్‌కు అలా ఆడలేను. క్రికెట్‌పరంగానే కాక ఇతర వ్యవహారాల్లోనూ ఆ జట్టుతో నాకు మంచి అనుభవం లేదు. క్రికెటర్‌గా నన్ను ఎలా ట్రీట్ చేయాలనుకుంటానో అలా వారు వ్యవహరించలేదు’ అని స్పష్టం చేశారు.