News July 3, 2024

ఫలితాలు విడుదల

image

TG: బాసర ఆర్జీయూకేటీ 2024-25 ఫలితాలు విడుదలయ్యాయి. 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్‌కు సంబంధించిన విద్యార్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. సైట్: https://www.rgukt.ac.in/

Similar News

News July 6, 2024

నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టుకి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. 2 రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.

News July 6, 2024

శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం

image

AP: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని ఆర్కియాలజీకి పంపగా.. ఆ లిపి 14,15వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం, పలు తామ్రపత్రాలు బయటపడ్డాయి.

News July 6, 2024

అసెంబ్లీ సీట్లు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి: ఎంపీ వినోద్

image

తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని.. ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దవుతుందన్నారు. ఇవాళ జరిగే ఇద్దరు సీఎంల భేటీలో ఈ అంశంపై చర్చించాలన్నారు. అలాగే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. ఏపీ, తెలంగాణలో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని గుర్తుచేశారు.